ప్రకాశం జిల్లా ఒంగోలులో.. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. విశ్వసేవిక ట్రస్టు ఆధ్వర్యంలో నరహరి విమలమ్మ, పద్మనాభయ్య వృద్ధాశ్రమం ఏర్పాటైంది. 27 ఏడేళ్ల క్రితం.. లలితాదేవి, లక్ష్మీనర్సమ్మ, ఇందిరాదేవి అనే ముగ్గురు స్నేహితురాళ్లు కన్నకల ఇది.. ఉన్నతోద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు అప్పట్లో.. వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు విమలమ్మ వారికి ఉచితంగా భవనం అప్పగించారు. అలా పాతికేళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆశ్రమం అప్పటి నుంచి ఎందరో వృద్ధులకు సేవలందిస్తోంది.
ఇక్కడ చేరిన మహిళలది ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ.. ఎవరు ఏ పరిస్థితుల్లో చేరినా.. అందరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది ఆశ్రమం. ఆశ్రమం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఇందిరాదేవి మరణించినా.. మిగిలిన ఇద్దరు స్నేహితురాళ్ళు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ఈ ఆశ్రమ నిర్వహణ కోసం ఎవరైనా దాతలు విరాళాలు అందిస్తే స్వీకరిస్తారు. ఆశ్రమంలో చేరిన వారి నుంచి మాత్రం ఎలాంటి ఫీజులూ తీసుకోకుండా.. పూర్తిగా ఉచితంగానే సేవలు అందించడం ఈ విశ్వ సేవిక ట్రస్టు ప్రత్యేకత.
ఇదీ చదవండి: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ.. ట్రీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ రక్షణ