ETV Bharat / state

అడ్డగోలుగా ఎర్రమట్టి కొండల తవ్వకం

పర్యావరణం, జీవ వైవిధ్యం పరంగా ఎంతో ప్రాధాన్యమున్న ఎర్రమట్టి కొండలవి. నాణ్యమైన గ్రావెల్‌ లభిస్తుండడంతో... అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. కొందరు నాయకుల అండతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ జేబులు నింపుకొంటున్నారు. ఓచోట స్థానికులు అడ్డుకుంటే... మరో ప్రాంతంలో పాగా వేసి దందా సాగిస్తున్నారు. పరిస్థితి ఇంతలా ఉన్నా సంబంధిత అధికారులెవరూ ఇటుగా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

illegal mining
అక్రమ తవ్వకాలు
author img

By

Published : May 20, 2021, 5:56 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో బొబ్బేపల్లి, కోలలపూడి, బొల్లాపల్లి, ద్రోణాదుల, ద్వారకపాడు గ్రామాల్లో వందల ఎకరాల్లో ఎర్రమట్టి కొండలు విస్తరించి ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇవి ఎంతో కీలకం. వివిధ రకాల అటవీ జీవులు సైతం ఇక్కడ ఆవాసం పొందుతున్నాయి. అటువంటి కొండలను కొందరు స్వార్థపరులు పిండి చేస్తున్నారు. భారీ యంత్రాలతో ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతూ... టిప్పర్లు, ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలతో పాటు పరిసర జిల్లాలకు సైతం తరలిస్తున్నారు. పగలు రాత్రన్న తేడా లేకుండా యథేచ్ఛగా కొండలను తొలిచేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి రోజుకు రెండు వేలకు పైగా ట్రక్కుల మట్టి తరలుతోందంటే తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్ఛు టిప్పర్‌ రూ.2000, ట్రాక్టర్‌ రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.

అక్కడ అడ్డుకోవడంతో ఇక్కడ...

ఇటీవల బొబ్బేపల్లి కొండపై సర్వే నం.526లో చేపడుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. కొద్ది రోజుల పాటు వాహనాలను ఎక్కడికక్కడ నిలువరించారు. అధికారులకు సైతం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమార్కులు తోకముడిచారు. తరువాత... కోలలపూడి, బొల్లాపల్లి మధ్య ఉన్న 360 ఎకరాల ఎర్రమట్టి కొండపై వారి దృష్టి పడింది. కొండకు దక్షిణం వైపున రెండు పొక్లెయిన్ల సాయంతో ఓ నాయకుడు టిప్పర్లకు మట్టి నింపి అమ్మకాలు చేస్తుండగా... పశ్చిమం వైపున ఓ బడా నాయకుడి కనుసన్నల్లో మరో వ్యక్తి తవ్వకాలు సాగిస్తూ ట్రాక్టర్లు, టిప్పర్లతో ఎర్రమట్టి తరలిస్తున్నారు. దీంతో కొద్ది రోజుల వ్యవధిలోనే కొండ రూపు కోల్పోయిందని ఆయా గ్రామాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లినా... చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

అన్ని విధాలా నష్టమే...

కొండలపై తవ్వకాల కారణంగా వాటిపై ఆవాసం ఏర్పరచుకున్న అటవీ జీవుల మనుగడకు ముప్పు ఏర్పడింది. ఎక్కడికక్కడ గుల్ల చేస్తుండడంతో పచ్చదనం సైతం హరించుకుపోతోంది. వర్షాల సమయంలో కొండపై నుంచి వచ్చే వరద నీటితో... సమీప గ్రామాల్లోని చెరువులు, ఇతర జలవనరులకు ఇబ్బంది ఉండేది కాదు. పరిసర ప్రాంతాల పశు పోషకులు... తమ పశు సంపద, జీవాలను మేత కోసం ఈ కొండల పైకే తీసుకువస్తారు. అక్రమార్కుల చర్యల కారణంగా భవిష్యత్తులో ఈ పరిస్థితి కనుమరుగై అన్ని విధాలా నష్టం తప్పదు. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో... పరిసర పల్లెల రహదారులు సైతం దెబ్బతింటున్నాయి.

రోడ్లు కుంగిపోతున్నాయి...

మా గ్రామం మీదుగా నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లు తిరుగుతున్నాయి. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. కాలువ కట్టలు సైతం వీటి కారణంగా కుంగిపోతున్నాయి. సాగర్‌ జలాలు విడుదల చేస్తే గండ్లు పడే అవకాశం ఉంది. ఒకరిని చూసి ఒకరు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు నిఘా పెట్టి ప్రభుత్వ సంపదను కాపాడాలి. - జొన్నలగడ్డ పేతురు, కోలలపూడి

ఉన్నతాధికారులకు నివేదిస్తాం...

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు... ఎలాంటి మైనింగ్‌ బిల్లులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్న రెండు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లను బొల్లాపల్లి వద్ద బుధవారం పట్టుకుని మార్టూరు స్టేషన్‌కు తరలించాం. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. - బీటీ నాయక్‌, విజిలెన్స్‌ సీఐ, ఒంగోలు

ఇదీ చదవండీ.. విశాఖ: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.