ETV Bharat / state

కరోనా వేళ.. చితికిపోతున్న చిరు వ్యాపారులు..! - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

కొవిడ్‌ ప్రభావం అన్ని వర్గాలవారిపై పడింది. ముఖ్యంగా చిరువ్యాపారులు చితికిపోతున్నారు. కర్ఫ్యూ అమలులో ఉండడంతో కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చిరు దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కరోనా నష్టాల నుంచి బయటపడే సమయానికి ఈ సంవత్సరం మళ్లీ వ్యాధి వ్యాప్తి విజృంభిస్తుండడంతో వారి జీవనం కష్టంగా మారుతోంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అమ్మకాలు చేస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలో వ్యాపారం సరిగా సాగక, తెచ్చిన అప్పులు తీర్చలేక మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, పూలు, ఆటో కార్మికులపై లాక్‌డౌన్‌ ప్రభావం చూపుతోంది. ఈ విధంగా ఎప్పటి వరకూ జీవనం సాగించాలో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

street vendors
వీధి వ్యాపారులు
author img

By

Published : May 15, 2021, 8:42 PM IST

ప్రకాశం జిల్లా కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో తోపుడు బండ్ల నిర్వహకులు సుమారు 300 మంది ఉన్నారు. సింగరాయకొండ, టంగుటూరు, కొండేపిలో మరో 200 మంది ఉంటారు. వారు పండ్లను నెల్లూరు, బెంగళూరు, కడప ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తుంటారు. సోడాబండి, పూలకొట్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు మరో 500 వరకూ ఉంటారు. ఇలాంటి వారందరూ తక్కువ సమయంలో విక్రయాలు నిర్వహించలేక అప్పులు పాలవుతున్నామని చెబుతున్నారు. బాగా వ్యాపారం జరిగిన కాలంలో రోజూ సుమారు రూ. కోటి వరకూ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం రూ. 20 లక్షలకు మించడం లేదని మార్కెట్‌ నిర్వహకులు చెబుతున్నారు.

నష్టం వస్తోంది
గుడ్లూరు బస్టాండు కూడలిలో తోపుడు బండిపై పండు అమ్ముతున్నాను. సాధారణ సమయాల్లో రోజుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ విక్రయాలు సాగించేవాడిని. ప్రస్తుతం అమ్మకాలు సాగించేందుకు ఆరు గంటల సమయం మాత్రమే ఉండడంతో చుట్టు పక్కల గ్రామాల వారు ఇక్కడికి రావడం తగ్గించారు. దాంతో రోజుకు కేవలం రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు మాత్రమే విక్రయాలు సాగిస్తున్నా. తెచ్చిన సరకు ఎక్కువ కాలం నిల్వ ఉండాల్సి రావడంతో నష్టం వస్తోంది. ఇదే పరిసితి మరి కొంతకాలం కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
- జి.బుజ్జి, గుడ్లూరు

ప్రభుత్వం ఆదుకోవాలి
కందుకూరు పామూరు బస్టాండు కూడలిలో తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముతున్నారు. గతంలో వ్యాపారాలు బాగా జరిగేవి. లాభాలు వచ్చేవి. ప్రస్తుతం రోజుకు రూ. 1500 విక్రయాలు చేయలేకపోతున్నా. మధ్యాహ్నం 12 కాగానే పోలీసులు బండ్ల తొలగించాలని చెబుతున్నారు. కర్ఫ్యూ కావడంతో ప్రజలు పెద్దగా బయిటకు రావడం లేదు. దాంతో అమ్మకాలు చాలా వరకూ తగ్గి నష్టం వస్తోంది. పండ్లు నిల్వ ఉండడంతో పాడైపోతున్నాయి. విక్రయించుకునేందుకు సమయం పెంచితే చిరు వ్యాపారులకు వెసులుబాటుగా ఉంటుంది. తోపుడు బండ్లపై ఆధారపడి బతికే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్‌డౌన్‌ సమయంలో వారికి నగదు అందజేయాలి.
- సుబ్బారావు, కందుకూరు

ఇదీ చదవండీ.. ఆగని రెమ్‌డెసివిర్‌ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.