ETV Bharat / state

పలుచోట్ల స్పెషల్ ఎన్​ఫోర్స్​​మెంట్ బ్యూరో అధికారుల దాడులు - today prakasam district Special Enforcement Bureau latest news update

ప్రకాశం జిల్లాలో పలుచోట్ల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిని అరెస్టు చేసి, టిప్పర్​ను స్వాధీనం చేసుకున్నారు.

Special Enforcement Bureau
స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు
author img

By

Published : Apr 13, 2021, 8:43 PM IST

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం గ్రామంలో ఓ వ్యక్తి నుంచి 19 మద్యం సీసాలను స్వాధీనపరచుకొని.. అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒంగోలులో 18 టన్నుల అక్రమ ఇసుకను, టిప్పర్​ను స్వాధీనపరచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 14 సెబ్ స్టేషన్ల పరిధిలో గల అన్ని రెస్టారెంట్లు, డాబాల మీద దాడులు నిర్వహించి.. యజమానులకు హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ సహాయ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

ఇసుక అక్రమ రవాణా.. మూడు ట్రాక్టర్లు సీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.