ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం తండాలో ఎస్ఈబీ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలతో పోలీసులు నాటుసారా కేంద్రాలపై దాడులు చేశారు. సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ దాడులలో గిద్దలూరు సివిల్ పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు, ఎక్సైజ్ సీఐ సోమయ్య, ఎస్సై రాజేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చదవండి 'న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే'