ఈ నెల 27న ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా యర్రగొండపాలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను.. జిల్లా ఎస్పీ మలిక గర్గ్ పర్యవేక్షించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం ఈ నెల 17న హైదరాబాదులో జరగగా, 27న రిసెప్షన్ కార్యక్రమం యర్రగొండపాలెంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ఇందులో భాగంగా.. హెలిప్యాడ్, వీఐపీ గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం, రిసెప్షన్ జరిగే వేదికను ఎస్పీ పరిశీలించారు. ఎలాంటి ఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు, బారికేడ్లలను ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇదీ చదవండి:
CM Jagan: 'ఆదిత్య బిర్లా కంపెనీ' ద్వారా తొలిదశలో 2 వేల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్