Software employees at Village: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎక్కడెక్కడో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా.. సొంత ఊర్లకు చేరిపోయారు. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ఇంట్లో పనిచేస్తూ, కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఎప్పుడో పండుగలకు మాత్రమే సరదాగా కలిసే వీళ్లంతా.. ఇప్పుడు మాత్రం నెలల పాటు పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. హాయిగా పని చేసుకుపోతున్నారు. ఒకరికొకరు సలహాలు, సూచనలు చేసుకుంటూ.. ఉద్యోగాలు చేసుకుంటున్నారు... ప్రకాశం జిల్లాలోని ఓ పల్లెటూరు యువకులు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటేనే... పెద్ద నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో విధులు. సమయానికి తిండీ తిప్పలు లేని హడావిడి పనులు. ఎప్పుడో కానీ... పుట్టిన ఊరికి వెళ్లలేని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కలుసుకోలేని పరిస్థితి. ఇదంతా... కొవిడ్‌కు ముందు. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగులంతా... వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : వాలంటీర్ల నిర్వాకం.. సామాజిక పింఛన్ నుంచి ఇంటిపన్ను వసూలు..!
Techies in Nelaturipadu : ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ప్రకాశం జిల్లా, మద్దిపాడులోని నేలటూరి పాలెంకు చెందిన యువకులు ఓ చోటకి చేరి సరదాగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు పని చేస్తోంది... ఈ తాటాకుల పందిరిలోనే. వివిధ మల్టీ నేషనల్ సంస్థల్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, హెచ్ -ఇన్‌ఛార్జీలు, ప్రోగ్రామర్లుగా. పనిచేస్తున్న వీళ్లంతా కార్పొరేట్ నగరాల్ని వదిలి... ఇలా ప్రశాంత పల్లే వాతావరణంలో సంతోషంగా గడుపుతున్నారు.
ఈ ఒక్క ఊరిలోనే దాదాపు 50 మందికి పైగా యువత సాఫ్ట్‌వేర్ కొలువుల్లో ఉన్నారు. పైగా... ఇది పల్లెటూరు కావడంతో సరిగా సిగ్నల్స్ రావడం లేదు. దాంతో... ఇలా ఊరి చివర ఓ పందిరి ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లోనే... ఆఫీస్ సమయమంతా గడిపేస్తున్నారు. తమకు అప్పగించిన పనుల్ని చకాచకా పూర్తి చేసుకుని... మిగితా సమయంలో స్నేహితులతో ముచ్చట్లతో గడిపేస్తున్నారు.
గతంలో ఏ పండక్కో, శుభకార్యాలకు మాత్రమే ఊరికి వచ్చే వాళ్లు... కుటుంబ సభ్యులతో రెండ్రోజులు గడిపేలోగానే మళ్లీ ఆఫీసులకు పరుగులు తీయాల్సి వస్తుండేది. కానీ.. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా తల్లిదండ్రులు, స్నేహితులతో చాలా సమయం గడుపుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో... పాఠశాలలో పక్కపక్కనే కలిసి కూర్చున్న తామూ, మళ్లీ ఎన్నో ఏళ్లకు పక్కపక్కన కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : Missing Girl Identified: అమ్మ ప్రేమ కోసం.. ఆ బాలిక ఏం చేసిందంటే..!
Work from Home at Nelaturipadu village: ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగాలు సాధించిన యువతకు... సీనియర్లు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడేందుకు, పై స్థానాలు చేరుకునేందుకు కావాల్సిన మెలుకువలు నేర్పుతున్నారు. ఒక్కచోట ఉండడంతో... ఒకరికి ఒకరు సహాయంగా నిలుస్తున్నారు. వారి సంస్థల ప్రయోజనాలకు, భద్రతకు ఎలాంటి ముప్పూ తలెత్తకుండా... జాగ్రత్తలగా వ్యవహరిస్తున్నారు.. ఈ యువకులు.
వీరి ఉద్యోగ విధానాలు చూసి ఆసక్తి చూపిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు... ఈ యువకులు. ఉద్యోగాలకు ఎలా సిధ్ధం కావాలి, ఏ సంస్థల్లో ఖాళీలున్నాయో తెలుపుతూ... సహకరిస్తున్నారు.
సంస్థలు వేరయినా, అంతా ఒకే దగ్గర పనిచేసుకోవడం వల్ల పని ఒత్తడి తెలియడం లేదని, పైగా సొంత ఊళ్ళో ఇంటి వద్ద ఉండి పనిచేసుకోవడం వల్ల ఖర్చులు బాగా తగ్గుతున్నాయం టున్నారు... ఈ కుర్రాళ్లు. మొత్తానికి ఈ విధానంలో.. తమకు ఆర్థికంగా, మానసికంగా ప్రశాంతంగా ఉందంటున్నారు..
ఇదీ చదవండి : Unsecured loan to MSMEs : ఎంఎస్‌ఎంఈలకు హామీ లేని రుణం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!