ETV Bharat / state

తప్పిపోయిన పిల్లలని తల్లిలా లాలించిన మహిళా ఎస్సై.. ఆ తర్వాత - 3 children missed in shivaratri celebrations

SI Krishna Pavani :ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి దేస్థానంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో... భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేడుకలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను... బందోబస్తులో ఉన్న మహిళా ఎస్సై కృష్ణ పావని ఆలనా పాలనా చూడటం పలువురిని ఆకట్టుకుంది. తల్లిదండ్రుల కోసం చిన్నారులు ఏడుస్తుంటే... వారిని కృష్ణ పావని అమ్మలా లాలించి తినుబండారాల అందించారు. అనంతరం వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి.... పిల్లలను అప్పగించారు. సురక్షితంగా చిన్నారులను చేరవేసినందుకు ఎస్సై కృష్ణ పావనికి వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

SI
ఎస్సై
author img

By

Published : Feb 20, 2023, 2:01 PM IST

తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నారులు

SI Krishna Pavani : మహాశివరాత్రి వేడుకలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను.. అక్కడ బందోబస్తులో ఉన్న మహిళా ఎస్సై కృష్ణ పావని గమనించి వారి ఆలనా పాలనా చూడటం పలువురిని ఆకట్టుకుంది. తల్లిదండ్రుల కోసం చిన్నారులు ఏడుస్తుంటే.. వారిని అమ్మలా లాలించి తినుబండారాల అందించారు. అనంతరం వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి... పిల్లలను అప్పగించారు. సురక్షితంగా చిన్నారులను అప్పగించినందుకు ఎస్సై కృష్ణ పావనికి వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే..

మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో శివరాత్రి జాగరణ భాగంగా ఆలయ కమిటీ వారు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆయా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫలితంగా స్వామి వారి ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులతో ప్రజలతో కిక్కిరిచిపోయింది.

ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించే పనిలో ఉన్న తల్లిదండ్రుల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు చిన్నారులు తప్పిపోయారు. చిన్నారులు రోదిస్తూ జనాల మధ్య తిరుగుతుండంతో తిరుణాల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల ముగ్గురు చిన్నారులను దగ్గరకు తీసుకొని పక్కనే ఉన్న మహిళా ఎస్సై కృష్ణ పావనికి తెలియజేయడంతో ఆ ముగ్గురు చిన్నారులను దగ్గరకు తీసుకొని వారిని తమ తాత్కాలిక శిబిరంలో ఉంచారు.

చిన్నారులు వారి తల్లిదండ్రుల కోసం రోదిస్తుంటే వారిని మాతృ హృదయంతో అమ్మలా లాలించి తినుబండారాల పెట్టి వివిధ రకాల ఆట బొమ్మలను అందజేసింది. రాత్రంతా చిన్నారుల మంచి చెడులను చూస్తూ తమ శిబిరంలోనే ఉంచుకున్న ఎస్సై కృష్ణ పావని తల్లి ప్రేమను చాటుకుంది. అనంతరం వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని ముగ్గురు చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. తమ పిల్లలను తమ వద్దకు సురక్షితంగా చేసినందుకు చిన్నారుల తల్లిదండ్రులు ఎస్సై కృష్ణ పావనికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.