తెలంగాణ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కంభం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. తురిమెల్ల సమీపంలో రూ.8 లక్షల విలువగల మద్యం, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కంభం ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: 'మైనింగ్‌కు కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చారు'