ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం ప్రాంతంలో గుండ్లకమ్మ నది తీరంలో ఉన్న సాగుభూముల్లోని ఇసుకను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. ఒకవైపు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతుంటే ఇక్కడ లభిస్తున్న ఇసుకను యథేచ్చగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ఇసుక తవ్వకాలు సాగిస్తూ కొంతమంది వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పగలంతా తవ్వకాలు సాగిస్తూ రాత్రి సమయంలో వందల లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నదికి ఇరువైపులా ఉన్న గట్లును తవ్వి గుత్తేదారులు లాభపడుతున్నారు. ఇక్కడ ఇసుక నిల్వ తగ్గిపోవటంతో పక్కనే ఉన్న పంట భూముల్లో ఇసుక తవ్వుతున్నారు. ఒక యూనిట్‌కు వంద రూపాయల చొప్పున పొలం యజమానికి చెల్లిచటంతో సాగుకన్నా ఇదే లాభంగా ఉందని రైతులు ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్నారు. జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉండి నిర్మాణ రంగం స్తంభించిపోతే ఇక్కడ ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించటం ఏంటని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇదీ చూడండి: