ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సగిలేరు సప్లై ఛానల్ వ్యర్థాలతో దర్శనమిస్తోంది. ఈ ఛానల్ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా... కాలువలోని పూడికతీత పనులు ఐదు సంవత్సరాల క్రితం చేశారు. మళ్లీ కాలువ వ్యర్ధాలతో నిండిపోయి కళావిహీనంగా దర్శనమిస్తోంది. సప్లై ఛానల్ పక్కనే మద్యం విక్రయిస్తున్న నేపథ్యంలో మందుబాబులు మద్యం తాగి కాలువలో మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు వేస్తున్నారు. ఫలితంగా కాలువ మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది. వర్షాకాలంలో నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి తయారవుతుందని.. ఇదే విధంగా కొనసాగితే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గొలుసు దుకాణo తొలగించాలని... సప్లై ఛానల్ను శుభ్రం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
మందుబాబుల నిర్వాకం... సగిలేరు కాలువ కలుషితం - సగిలేరు సప్లై ఛానల్ తాజా న్యూస్
గిద్దలూరు సగిలేరు సప్లై ఛానల్ మందుబాబుల నిర్వాకంతో కాలుష్యంగా మారింది. పక్కనే ఉన్న గొలుసు దుకాణం ఉండటంతో మందు బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులను అందులో వేస్తున్నారు.
![మందుబాబుల నిర్వాకం... సగిలేరు కాలువ కలుషితం agileru channel pollute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6237002-232-6237002-1582894237841.jpg?imwidth=3840)
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సగిలేరు సప్లై ఛానల్ వ్యర్థాలతో దర్శనమిస్తోంది. ఈ ఛానల్ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా... కాలువలోని పూడికతీత పనులు ఐదు సంవత్సరాల క్రితం చేశారు. మళ్లీ కాలువ వ్యర్ధాలతో నిండిపోయి కళావిహీనంగా దర్శనమిస్తోంది. సప్లై ఛానల్ పక్కనే మద్యం విక్రయిస్తున్న నేపథ్యంలో మందుబాబులు మద్యం తాగి కాలువలో మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు వేస్తున్నారు. ఫలితంగా కాలువ మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది. వర్షాకాలంలో నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి తయారవుతుందని.. ఇదే విధంగా కొనసాగితే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గొలుసు దుకాణo తొలగించాలని... సప్లై ఛానల్ను శుభ్రం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి-తాను లేడని తెలిసి.. తనువు చాలించి...