కరోనా మహమ్మారి అన్నీ రంగాల వారిని అతలాకుతలం చేసింది... నాలుగు నెలలు గడుస్తున్నా ప్రగతి చక్రాలు కదలక జీవనం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు, యాజమానులు.
రాష్ట్రం మెుత్తం మీద 2,786 ఆర్టీసీ అద్దె బస్సులు ఉండగా, ప్రకాశం జిల్లాలోని వివిధ డిపోల పరిధిలో 185, చీరాల ఆర్టీసీ బస్ డిపోలో 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మార్చి నెల 22న జనతా కర్ఫ్యూ తరువాత రోజు నుంచి ప్రారంభమైన లాక్డౌన్తో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నాలుగు నెలలు గడుస్తున్నా బస్సులు కదలక... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అద్దె బస్సుల డ్రైవర్లు, యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి కొన్న బస్సులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యజమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కేంద్ర ఎమ్మెస్సీ స్కీమ్ కింద 20 లక్షల కోట్ల రూపాయల నిధులు విడుదుల చేసిందనీ... తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు.
కుటుంబాన్ని నెట్టుకురావటం చాలా కష్టంగా ఉంది. బస్సు అద్దెలు చెల్లించలేకపోతున్నాము.- అద్దె బస్సు యజమాని
డ్రైవర్ లేకపోతే ఏ వాహనం కదలదు. అటువంటి మమ్మల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వివిధ వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించినట్లే మాకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.-బస్సు డ్రైవర్
ఇదీ చదవండి: కరోనా రోగి మృతదేహ ఖననం అడ్డుకున్న యువకులు... పూర్తి చేసిన పోలీసులు