BUS COLLIDED: ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కొత్తూరు వద్ద ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాలను ఢీట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 14 మంది సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. నిజామాబాద్ నుంచి నెల్లూరు జిల్లా వింజమూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి దాటిన తర్వాత.. బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్లు సీట్లు మారుతున్న సమయంలో బస్సు అదుపుతప్పి.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు విద్యుత్ స్తంభాలతో పాటు.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో.. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రమాదం నుంచి బస్సులోని 14 మంది ప్రయాణికులు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి.. డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. బస్సు డ్రైవర్ మాత్రం.. గేదెను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పిందని చెప్పారు.
ఇవీ చదవండి: