రానున్న అయిదేళ్లల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే రోటరీ క్లబ్ లక్ష్యమని ప్రకాశం జిల్లా, చీరాలలోని రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి అధ్యక్షుడు తడివలస దేవరాజ్ అన్నారు. 2020- 2021కి సంబంధించి గవర్నర్ అఫీషియల్ విజిట్ రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి సమావేశాన్ని నిర్వహించారు. సేవా కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యంతో బాధ పడుతున్న కనకరావుకు శ్రీ కామాక్షి కేర్ ఆసుపత్రి తరుపున రూ.30 వేలతో ఎయిర్ కంప్రెసర్ మిషన్ను అందజేశారు. నన్నపనేని రామకృష్ణ తరపున, శివ కుమారి అనే మహిళకు కుట్టు మిషన్ను వితరణ చేశారు.
ఈ ఆరే మాకు కీలకం
ప్రాథమిక విద్య, తల్లి-బిడ్డ ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, పేద వారికి ఆర్థిక చేయూత, ప్రపంచ శాంతి వంటి అంశాలతో ముందుకెళుతున్నామని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో పోలియోను నిర్మూలించడానికి అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ రోటరీ క్లబ్ చేసిన కృషి ఎనలేనిదని గుర్తు చేశారు. ఇందులోని ప్రతి సభ్యుడు సమాజ అభివృద్ధికి తోడ్పడలన్నారు. చీరాలలోని ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: అలరిస్తున్న నల్లమల్ల జలపాత అందాలు