గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా వేటపాలెంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చీరాల నుంచి వేటపాలెం వెళ్లే రహదారిలో భారీ ఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారిపక్కన కాలువ నిర్మాణాలు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలకు దిగాలని వేడుకుంటున్నారు.
ఇదీచదవండి