ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బాలవెంకటాపురం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. బొటికర్లపాడు గ్రామానికి చెందిన కుమ్మరికుంట జయరాం.. కుమార్తె ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివన్నారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..