ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈతముక్కలకు చెందిన సదాశివం కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. నిర్మాణం కోసం అవసరమైన రాళ్లు కొనుగోలు చేసేందుకు భార్యతో కలిసి బైక్పై గ్రోత్ సెంటర్కు వెళ్లారు. అక్కడ పనిచూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
వెల్లంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో సదాశివం అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంకో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సదాశివం భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: