ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చెల్లగిరిలోని ఓ రైతు పొలంలో సుమారు 50బస్తాల కంది పంట అగ్నికి ఆహుతయ్యింది. గ్రామానికి చెందిన బసిరెడ్డి వెంకటేశ్వర్లు మూడు ఎకరాల్లో కంది పంట వేశారు. పండిన పంటను కుప్పగా వేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే పంటంతా దగ్ధమయ్యింది. కష్టపడి పండించిన పంటను.. రాజకీయ కక్షతో కావాలనే కాల్చి వేశారని వెంకటేశ్వర్ల భార్య బోరున విలపించింది. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే పంట దగ్ధం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: వేటపాలెం నుంచి చీరాల వరకు ఎడ్లబండ్లతో నిరసన