రెడ్ జోన్ ప్రాంతాల్లో రేషన్ సరకులను ఇంటికే ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో కరోనా పాజిటివ్ కేసులు పెరగిన కారణంగా.. రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో లబ్ధిదారులకు సరకులను ఇళ్లకే తీసుకెళ్తున్నారు.
ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి లబ్ధిదారుల ఇంటి వద్దే కాటా వేసి ఇస్తున్నట్లు కారంచేడు తహసీల్దార్ వెంకటరెడ్డి తెలిపారు. డీలర్ వద్దకే వచ్చి వేలిముద్రలు వేసి తీసుకెళ్లాలనే నిబంధన నుంచి రెడ్ జోన్ ప్రాంతాన్ని మినహాయించినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: