ప్రకాశం జిల్లా దర్శిలోని పొదిలి రోడ్డులో 3 రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, వైకాపా నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలకు మేలు కూర్చే బిల్లులకు తెదేపా నేతలు అడ్డుపడుతున్నారనే శాసనమండలిని రద్దు చేసినట్లు వెల్లడించారు. సీఎం తీసుకునే నిర్ణయాలకు తామందరం కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: ముస్లిం బాలిక... శ్లోకాల గీతిక..!