లారీ ట్రాన్స్పోర్టు పేరుతో రైతుని మోసగించి పిల్లిపెసర విత్తనాల లోడుతో పరారైన రాజస్థాన్ ముఠాను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువ చేసే విత్తన లారీని స్వాధీనం చేసుకున్నారు. నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరం గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం కోల్డ్ స్టోరేజీకి తీసుకువెళ్లాల్సిన లారీని డ్రైవర్ దారి మళ్లించి కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యాపారికి విక్రయించాడు. హైదరాబాద్లోని నాచారం కేంద్రంగా శివశక్తి అగ్రోసీడ్స్ పేరుతో కార్యాలయం నడుపుతున్న రాజస్ధాన్కు చెందిన ముఠా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యుల్లో సుమిత్ శర్మను నందిగామ వద్ద అదుపులోకి తీసుకోగా...మిగిలిన ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి