ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుసింది. ఒంగోలు పట్టణంలో పిడుగుల శబ్దాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. సుమారు గంటసేపు వర్షం కురుసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చీరాల, పర్చూరు, అద్దంకి, పొదిలి మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. వర్షంతో చేతికి వచ్చిన పంట నీట మునిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!