ETV Bharat / state

కుందేళ్లతో ఆటలు..! లేగ దూడలతో పాటలు..!!

Rabbits And Calf House: వారింటికి వెళ్తే వారికి ఎదురొచ్చి వెల్ కమ్ చెప్తాయి ముద్దు ముద్దు చెవుల పిల్లులు. ప్రేమతో దగ్గరకు వస్తాయి లేగ దూడలు.. వాటి కోసమైనా పదే పదే వెళ్లాలనిపించేలా ముద్దు ముద్దుగా అల్లరి చేస్తాయా మూగజీవులు. కుందేళ్లను, దూడలను ఒక్కచోటే చూస్తూ...వాటితో ఆడుతూ ఉంటే సమయాన్ని కూడా ఇట్టే మర్చిపోతాం...మీకూ చూడాలి..ఆడాలి అనిపిస్తుందా..? ఎక్కడా అంటారా ? చదివేయండి మరీ..

కుందేళ్లతో ఆటలు..! లేగ దూడలతో పాటలు..!!
కుందేళ్లతో ఆటలు..! లేగ దూడలతో పాటలు..!!
author img

By

Published : Feb 13, 2022, 8:12 PM IST

Rabbits And Calf House: కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఆ సమయంలో చిన్నారులకు చదువులు చెప్పడం, వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద పనిగానే మారిందని చెప్పాలి. ఇలాంటి అల్లరి పిల్లల కోవకి చెందిన వారే ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన ఇద్దరు అమ్మాయిలు శివ నాగ సమీరా, శివ జ్యోతిక. కొవిడ్ తో పాఠశాలలు మూసివేయడంతో ఇంటి వద్దే ఉంటూ చదువుతో పాటు ఆటలు పాటలూ కొనసాగించారు. చదువు సంధ్యలతో పాటుగా అల్లరిలో కూడా ముందున్నారు. పిల్లల దృష్టి అల్లరిపై నుంచి మరల్చేందుకు వారి కోసం రెండు బుజ్జి బుజ్జి.. ముద్దు ముద్దు కుందేలు పిల్లల్ని తెచ్చారు సమీరా, జ్యోతికల తండ్రి గోనుగంట సుబ్బారావు.

కుందేళ్లతో ఆటలు...లేగ దూడలతో పాటలు...

కొత్తగా వచ్చిన నేస్తాలతో ఆడుతూ...వాటిని అల్లారుముద్దుగా పెంచుతూ వారి నాన్నలాగే సమీరా, జ్యోతిక జంతు ప్రేమికులుగా మారిపోయారు. రెండేళ్లలో మొత్తం 50కి పైగా కుందేళ్లను పెంచుతూ జంతు ప్రేమను చాటుతున్నారు. అంతేనా కేవలం కుందేళ్లే కాదు వీరి ఇంట్లో ఆవు దూడలు కూడా ఉన్నాయి. కుందేళ్లు, దూడలు కలిసి మెలిసి పచ్చిక తింటూ..ఎంతో స్నేహంగా మెలుగుతాయి.

కుందేళ్లు, లేగ దూడలు తమ కుటుంబ సభ్యుల్లా మారిపోయాయని ఎంతో సంతోషంగా చెబుతారు వారంతా. జంతువులపై తనకున్న ప్రేమతోనే వాటిని పెంచుతున్నట్లు సుబ్బారావు చెబుతున్నారు. వారి ఇంట్లో పెరుగుతున్న దూడలు, కుందేళ్లను చూడటానికి...వాటితో ఆడుకోవడానికి ఇరుగుపొరుగు చిన్నారులు పోటీపడుతుంటారని చెబుతున్నారు.

" మొదటి నుంచి మాకు జంతువులంటే చాలా ప్రేమ. అందుకే ఆవులు, కుందేళ్లను పెంచుతున్నాం. ప్రతీ ఒక్కరు కూడా జంతువుల పట్ల ప్రేమగా ఉంటూ...ఇంటికి ఒక ఆవునైనా పెంచాలని కోరుతున్నాం." - గోనుగంట సుబ్బారావు, జంతు ప్రేమికుడు

ఇదీ చదవండి : కంట్రోల్ రూం పరికరాలు చోరీ.. అమరావతి రైతుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.