ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం చెరువు కట్టపైన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కందుల నాగార్జున రెడ్డి జయంతి కార్యక్రమంలో.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం రాయలసీమపై నిర్లక్ష్యం చూపుతోందని, గ్రేటర్ రాయలసీమ ఇవ్వాల్సిందేనని.. గంగుల ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యలను విభేదించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. వెలిగొండను పూర్తి చేసి 2021 నాటికి రాయలసీమను కరవు పీడిత ప్రాంతంగా మారుస్తామని బదులిచ్చారు.
ఇదీ చదవండి: