ప్రకాశం జిల్లా కోచెర్ల కోటలో 13వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంపీడీఓ అవకతవకలకు పాల్పడ్డరని సర్పంచి అభ్యర్థి, గ్రామస్థులు ఆరోపించారు. లెక్కింపు పక్రియ ఆలస్యం చేసి మొదటగా కత్తెర గుర్తు గెలిచిందని చెప్పి... తరువాత ప్రత్యర్థి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారన్నారు. రీకౌంటింగ్ జరపాలని కోచెర్ల కోట గ్రామస్థులు... దొనకొండ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు.
రాత్రి భోజన సమయంలో ఎంపీడీఓ.. ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడని... పోలింగ్ కేంద్రం వద్దకు తన అనుచరులను పంపించి తమ మద్దతుదారు గెలిచేలా చేశారని గ్రామస్థులు ఆరోపించారు.
ఇదీ చదవండి