ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కట్టా సింగరకొండ... ఈ నెల 18 న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ నెల 22న సింగరకొండను చూసేందుకు బంధువులు ఆస్పత్రికి రాగా... బాధితుడు కనిపించలేదు. ఈ ఘటనపై వైద్య సిబ్బందిని సంప్రదించగా... ఈ నెల 21 నే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సింగరకొండ బంధువులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్తు తెలియని మృతదేహంగా...
ఇంతలో జీజీహెచ్‌లో గుర్తు తెలియని మృతదేహం ఉందని, శవాగారంలో భద్రపరిచామంటూ ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రిలో ఉన్న మృతదేహం సింగరకొండదేనని గుర్తించిన కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చే వారికి సరైన చికిత్స చేయకపోగా, ఎవరికి చికిత్స చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.