ETV Bharat / state

పారిశుద్ధ్య సమస్యలు... పరిశ్రమలకు నష్టాలు - sanitation problems

వెనుకబడిన జిల్లా అయిన ప్రకాశంలో పారిశ్రామికాభివృద్ధితో కొంతమందికైనా ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన గ్రోత్‌ సెంటర్‌లో సమస్యలు తాండవిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన కనీస మౌళిక సదుపాయాలు లేక పారిశ్రామిక వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పరి'శ్రమ'
author img

By

Published : Jun 2, 2019, 11:51 PM IST

పరి'శ్రమ'

ప్రకాశం జిల్లాలో కావలసినంత భూమి ఉన్నప్పటికీ అది వ్యవసాయానికి అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒంగోలుకు సమీపాన మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద గ్రోత్ సెంటర్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 14 వందల 40ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వందల ఎకరాల్లో గ్రోత్‌ సెంటర్​ని ప్రారంభించారు. కానీ మౌళిక సదుపాయల కల్పనలో ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామిక మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) శ్రద్ధ చూపడం లేదని విమర్శలున్నాయి.

ఇప్పటికీ ఇక్కడ డ్రైనీజీ వ్యవస్థ లేదు. గ్రానైట్‌ వ్యర్థాలు పారబోయడానికి డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయలేదు. వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారబోయడం వల్ల నేల కలుషితమవడమే కాకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గ్రోత్‌ సెంటర్‌ ఆవరణలో 25శాతం మేర పచ్చదనం కోసం చెట్లు పెంచాల్సి ఉన్నా ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు.

నీరు లేక నానా కష్టాలు

గ్రోత్ సెంటర్​లో నీటి వసతి లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. పూర్తిగా భూగర్భ జలంపైనే ఆధార పడాల్సి వస్తుంది. ఒకో పరిశ్రమకు 5వేల నుంచి 10వేల లీటర్లు అవసరం అవుతాయి. ఇతర ప్రాంతాలనుంచి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా అధికారుల పట్టించుకోవడంలేదు. భూగర్భ జలాలు కూడా రోజు రోజుకూ అడుగంటి పోతున్నాయి. రసాయన వ్యర్థాలు భూగర్భంలో కలిసి నీరు కలుషితమవుతోంది. సమీపంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ద్వారా గ్రోత్‌ సెంటర్​కు పైపు లైన్ల ద్వారా నీటిని మళ్లించాలని కోరుతున్నారు. ఈ గ్రోత్‌ సెంటర్‌లో ఇప్పటికే దాదాపు 10వేల మంది కార్మికులకు ఉపాధి పొందారు. సౌకర్యాలు బాగుంటే పరిశ్రమలు వృద్ధి చెంది ఉపాధి సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది.

Intro:చిత్తూరు జిల్లా మదనపల్లిలో మాలమహానాడు జిల్లా లా కార్యవర్గ సమావేశం

Body:మదనపల్లిలో మాల మహానాడు కార్యవర్గ సమావేశం

Conclusion:ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన దళితులపై దాడులు ఆగలేదని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి yamala సుదర్శన్ అన్నారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను మన ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో వారి పక్షాన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు దళితులు ఓట్లు తో గెలిచిన ప్రజా ప్రతినిధులు వారిపై దాడులు చేయడం వివక్షత చూపడం తగదన్నారు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న నేటికి దళితులు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి సాధించే లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు భక్తి చేయక అలాగే ఉండి పోయాయి అన్నారు రు రు ప్రైవేటు రంగంలో లో వీరికి రిజర్వేషన్ బేషరతుగా అమలు చేయాలని అమలు చేయని పారిశ్రామికవేత్తల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జస్టిస్ పున్నయ్య ప్రతిపాదించిన సివిల్ రైట్స్ డే సమావేశాన్ని నిర్వహించాలన్నారు ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పట్టకుండా దళిత వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు దళితులు ఐక్యంగా గా పోరాటం చేయడంతో పాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు ఈ సమావేశానికి జిల్లాలోని పలువురు మాలమహానాడు నాయకులు హాజరయ్యారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.