ప్రకాశం జిల్లా మార్టూరు మండల మజ్లీస్ పార్టీ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా కష్ట కాలంలో ప్రైవేటు పాఠశాలల అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం, పాఠశాల యాజమాన్యం గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్పే గురువుల జీవితం కరోనా కష్ట కాలంలో ప్రశ్నార్థకంగా మారిందని పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి అన్నారు కరోనా వల్ల పాఠశాలలు తెరుచుకోక, స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోక, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందక ఎంతోమంది ఉపాధ్యాయులు కూలీలుగా మారుతున్నారన్నారు.
ఈ కష్ట కాలంలో ప్రభుత్వం వీరికి అండగా ఉండాలని, ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలను దృష్టిలో ఉంచుకుని వీరికి గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి, స్కూలు యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మజ్లీస్ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాబక్షు, నాయకులు సనాఉల్లా బాషా, ఉస్మాన్ గని , నజీముద్దీన్, ఉపాధ్యాయులు నాగూర్, నారాయణలు పాల్గొన్నారు