ETV Bharat / state

ఇంటర్​ పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు - యర్రగొండపాలెంలో ఇంటర్మీడియట్ పరీక్షలు వార్తలు

రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అధికారులు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులంతా సకాలంలో పరీక్షలకు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

preparation of examination centers for intermediate exams in yerragondapalem in prakasham
రేపటి నుంచే ఇంటర్సీడియట్ పరీక్షలు.. సకాలంలో చేరుకోండి
author img

By

Published : Mar 3, 2020, 2:41 PM IST

ఇంటర్​ పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పరీక్షలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించనున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం, పెద్దదోర్నాలలో ఒక్కొక్కటి, యర్రగొండపాలెంలో రెండు చొప్పున నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సామాగ్రితో పాటు మౌలిక వసతులు కల్పించారు. కాపీయింగ్​కు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులంతా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.