రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం జగనన్న కాలనీల పేరిట ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అంతవరకు బాగానే ఉన్నా నిర్మాణానికి స్థలం ఎంపికపైనే లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉండటం, మరికొన్నిచోట్ల సౌకర్యవంతంగా లేకపోవడం వంటి పరిస్థితి ఉంది. దీనికితోడు హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో కొండలను గుట్టలను, చవుడు నేలలను ఎంపిక చేసి పట్టాలను పంపిణీ చేశారు. వారం రోజుల క్రితం ఇళ్ల నిర్మాణానికి సామూహికంగా శంకుస్థాపనలు చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
కనిగిరి నియోజవకర్గంలో జగనన్న కాలనీల్లో భాగంగా సుమారు 5 వేల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేశారు. ఇటీవల నగర పంచాయతీ, పామూరు మండలాల్లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులతో స్వయంగా పూజలు చేయించి పునాదుల పనులు చేయించారు. ఒక్క కనిగిరి నగర పంచాయతీలోనే వెయ్యి మందికి పైగా భూమి పూజ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పునాదులు వర్షపు నీటితో మునిగిపోయాయి. భూమిని గట్టిగా చదును చేయకపోవడంతో ఎక్కడి నీళ్లు అక్కడే నిలుస్తున్నాయి. చవుడు నేలలు కావడంతో విద్యుత్తు స్తంభాలు కుంగిపోతున్నాయి. ఫలితంగా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..రాగల మూడ్రోజులు వర్షాలు