ప్రకాశం జిల్లా పొదిలిలో ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నాగమణికంఠ నిఖిత్‌కు సంగీతంపై ఆసక్తి ఎక్కువ. కుమారుని అభిరుచి గ్రహించిన తల్లిదండ్రులు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. నిఖిత్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించాడు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భారత సైనికులపై పాటలు పాడి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నాడు.
ప్రకాశం జిల్లా స్థితిగతులు, అందచందాలు, ప్రకృతి సోయగాలు కలగలిపి స్వర్గీయ నాగభైరవ కోటేశ్వరరావు గేయాన్ని రచన చేయగా.. ఆ గేయానికి బాణీ కట్టాడు నిఖిత్. ఈ పాటకూ ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. ఇదే గేయాన్ని దేశ రాజధానిలో ఆలపించి అక్కడా సత్తా చాటాడీ విద్యార్థి.