అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. పథకాల అమలులో సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా సమర్థంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలతో పేదలు అభివృద్ధి చెందడానికి బాటలు వేయాలన్నారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యాలు చేరుకునేలా కృషిచేయాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
వివిధ వర్గాల అభ్యున్నతికోసం ప్రభుత్వం ప్రతిఏటా రూ. కోట్ల నిధులు వెచ్చిస్తోందని కలెక్టర్ తెలిపారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలుగా నమోదైన వారి అభివృద్ధికి సంక్షేమ శాఖలు, ఫైనాన్స్ కార్పొరేషన్లు స్థాపించి వివిధ పథకాలను అమలు చేస్తుందన్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం మంజూరుచేసిన ఉపకరణాలను తక్షణమే లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఇటీవల పశ్చిమ ప్రకాశంలో చెంచు గిరిజనులకు ఎదురైన సమస్యలు, దుర్ఘటనపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇదీ చదవండి: రహదారి విస్తరణ పనులను అడ్డుకున్న వ్యాపారులు