ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం లోని కలనూతల పోలింగ్ కేంద్రంలో ఈనెల 6న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఏప్రిల్ 11న ఈవీఎంలు మొరాయించి ..పోలింగ్ అసంపూర్ణంగా జరిగిందన్నారు. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదు మేరకు.. రీ పోలింగ్‌కు అనుమతి లభించిందన్నారు. ఈ పోలింగ్ కేంద్ర పరిధిలో ఉన్న 1070 మంది ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ కొనసాగుతుందన్నారు.
ఇవీ చదవండి..హోరాహోరీ పోరులో ప్రకాశించేదెవరు..?