ప్రకాశం జిల్లా అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు, పంగులూరు తదితర మండలాల్లో బొప్పాయి సాగుతో.. రైతులు మంచి ఆదాయం పొందేవారు. ఇక్కడ పండిన పంట దిల్లీతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. రైతులకు వ్యాపారులు అడ్వాన్సులు చెల్లించి మరీ కొనుగోలు చేసేవారు. టన్ను బొప్పాయి ధర 15 నుంచి 17 వేల రూపాయల వరకూ ధర పలికేది. అలాంటిది ఏడాది నుంచి బొప్పాయి కొనేవారు లేక రైతులకు నష్టాలు మిగులుతున్నాయి.
కరోనా కారణంగా గతేడాది రవాణా నిలిచిపోవటంతో.. దిల్లీ నుంచి వ్యాపారులు రావడం మానేశారు. ఒక్కసారిగా ఎగుమతులపై ప్రభావం పడింది. స్థానికంగానూ అంతగా కొనేవారు లేకపోవటం వల్ల పంట అంతా తోటల్లోనే వదిలేస్తున్నారు. టన్ను బొప్పాయి కనీసం రెండు వేలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడం వల్ల.. కొంతమంది రైతులు తోటలు తొలగిస్తున్నారు. గతంలో బొప్పాయి పండించిన వారిని చూసి.. ఈ ఏడాది పెట్టుబడులు పెట్టి, తీవ్రంగా నష్టపోయామని రైతులు అంటున్నారు.
ఇదీ చూడండి: TRAINS CANCELLATION: గులాబ్ తుపాన్ ప్రభావంతో రైళ్ల రద్దు