ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి స్థానిక వాలంటీర్ల సహాయంతో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనవసరంగా ప్రజలెవరూ బయటకు రావద్దని ఎమ్మెల్యే కోరారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. అధికారులు మీ వెంట ఉంటారని, ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి పౌరులంతా సైనికులే.. అందరికీ సెల్యూట్: మోదీ