NEW DISTRICTS UNSCIENTIFIC: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తలపెట్టన జిల్లాల పునర్విభజన అస్తవ్యస్థంగా ఉందని.. ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, సాంబశివరావు, వీరాంజనేయస్వామి సీఎం జగన్‌కు లేఖ రాశారు. విభజన ప్రక్రియ నిర్ణయం శాస్త్రీయంగా లేదని భావిస్తున్నట్లు వారు లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ప్రతిపాదనలు అమలులోకి వస్తే జిల్లా మూడు ముక్కలు అవుతుందన్నారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా.. జిల్లా ప్రజా ప్రతినిధులుగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: తహసీల్దార్ నాగార్జున రెడ్డిపై వైకాపా సర్పంచ్ దాడి
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడిన ప్రకాశం జిల్లా కల నెరవేరదని వారు లేఖలో స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలని కోరారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఉండాలని వారు సీఎం జగన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పామర్రులో పందుల పంచాయతీ... అసలేం జరిగిందంటే?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!