Pensions: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దలకేనా ? పేదలకు లేవా..? అంటూ ప్రకాశం జిల్లా పామూరులో క్షేత్రస్థాయి పరిశీలకులను ప్రజలు నిలదీశారు. పామూరు సచివాలయంలో వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛన్ల అర్జీదారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. వారంతా తీవ్రస్థాయిలో ఎంపీడీవో రంగ సుబ్బారాయుడుపై అవినీతి ఆరోపణలు చేశారు.
పింఛన్ల మంజూరు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు స్పందించడం లేదన్నారు. నగదు ఇస్తేనే పింఛన్ మంజూరు చేస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీడీవోను అధికారులు బయటకు పంపించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఇవీ చూడండి: