ETV Bharat / state

వంతెన కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న గన్నవరం గ్రామస్థులు - ప్రకాశం జిల్లాలో పొంగుతున్న వాగులు

పాలేటి వాగు పొంగిందంటే ఆ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు ఉండవు. సాహసించి వాగు దాటితేనే నిత్యావసరాలైనా దొరికేది. వంతెన నిర్మాణం ఏళ్ల కిందటే మొదలైనా...ఇంకా పిళ్లర్లస్థాయిలోనే ఉండిపోయింది. ఓట్ల కోసం వచ్చే నేతలు వంతెన పూర్తి చేస్తామన్న హామీలు తప్పా...పనిచేసిన నాథుడే లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగులు పొంగి గ్రామానికి మార్గంలేకుండా చేస్తున్న పట్టించుకున్న వారే లేరని గ్రామస్థులు వాపోతున్నారు.

paleti canal bridge
paleti canal bridge
author img

By

Published : Nov 30, 2020, 6:02 AM IST

వంతెన కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న గన్నవరం

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామంలో ఉన్న పాలేటి వాగుపై గతంలో వంతెన నిర్మాణ పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు అసంపూర్ణంగా ఉన్న వంతెన వల్ల చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాలేటి వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పాలేటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ గ్రామాల ప్రజలకు బయటకు వెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్ధృతంగా వాగు దాటేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కనీస అవసరాలకు కూడా గ్రామం దాటలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.

వంతెన సమీపములో గల గన్నవరం, చెన్నంపల్లి, గండ్లోపల్లి, నాగులవరం గ్రామాల ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ వంతెన మార్గంలోనే వీరి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టు పక్కల గ్రామాలకు ఈ వంతెన మార్గమే ముఖ్య రహదారి. ఆసుపత్రికి వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, మరే ఇతర పనులకు వెళ్లాలన్నా ఈ వంతెన మార్గంలోని ప్రయాణిస్తుంటారు. కానీ వర్షం వచ్చిందంటే చాలు వారి వెన్నులో వణుకు పుడుతుంది. వర్షానికి వంతెన చుట్టూ ఉండే వాగులు, వంకలు పొంగి పొర్లుతాయి. ఈ క్రమంలో ఇళ్లకు చేరుకునేందుకు వాళ్లు పడే బాధలు వర్ణనాతీతం.

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నీటిలో పడుతూ, లేస్తూ ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి. వాగు ప్రవాహం ఎక్కువైతే కనీసం నిత్యవసర సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు వంతెన నిర్మిస్తామని ఇచ్చే హామీలు మాటలుగానే మిగిలిపోతున్నాయని పరిసర గ్రామాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులకు తమ కష్టాలు పట్టడం లేదని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి త్వరిత గతిన పాలేటి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : రాజస్థాన్​లో ప్రకాశం పోలీసులపై దాడులు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.