OLIVE RIDLEY TURTLES: ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణ కోసం అటవీశాఖ నిరంతరం శ్రమిస్తోంది. చెన్నైకి చెందిన ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటి రక్షణను చేపడుతోంది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. పూర్వ ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరాల్లో.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు పెట్టే గుడ్లను పరిరక్షిస్తూ వస్తోంది. గుడ్ల సంరక్షణ మొదలుకొని వాటిని పొదిగించి.. తిరిగి సముద్రంలోకి వదిలి పెట్టేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని... చీరాల నుంచి గుడ్లూరు వరకు ఉన్న 102 కిలోమీటర్ల తీరంలో.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు గుడ్లు పెడుతూ ఉంటాయి. జనవరి నుంచి మే వరకు గుడ్లు పెట్టడం, పొదగడం, పిల్లలు తిరిగి సముద్రంలోకి వెళ్లే ప్రక్రియ సాగుతుంది. సముద్ర గర్భంలో జీవనం సాగించే ఈ తాబేళ్లు.. గుడ్లు పెట్టడానికి మాత్రం తీరంలోని ఇసుక తెన్నెల కోసం వేల కిలోమీటర్లు వెతుక్కుంటూ వచ్చి.. ఇక్కడ గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. ఈ గుడ్లను ఇతర జంతువులు, పక్షులు ఆహారంగా మార్చుకునే పరిస్థితి ఉంటుంది. వీటి సంతంతికి రక్షణ కరవవుతూ వచ్చింది.
ఆలివ్‌రిడ్లే తాబేళ్ల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని.. కొన్నేళ్లుగా అటవీశాఖ సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. 12 సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, గుడ్లను సేకరించి, హేచరీల్లో పొదిగేట్టు చేసి, తిరిగి పిల్లలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. చెన్నైకి చెందిన ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తీరం వెంట పాతిక మంది స్వచ్ఛంద సేవకులు నిరంతరం వీటిని పర్యవేక్షిస్తుంటారు. 2015 నుంచి ఈ కార్యక్రమం చేపడుతూ.. ఇప్పటివరకూ దాదాపు 50వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. మత్స్యకారులకు కూడా వీటి సంరక్షణలో అవగాహన కల్పిస్తూ, వాటి పరిరక్షణకు పాటుపడుతున్నారు.
ఇవీ చదవండి: Fire accident: ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన కార్మికులు