ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ట్రిపుల్ఐటీ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాలు 24 గంటల్లో అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శాంపిల్స్ త్వరగా జిల్లా కేంద్రానికి తరలించేందుకు అదనపు మార్గాలు ఏర్పాటు చేయడం, వాహనాలను కూడా అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం 3 వేల పడగలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న రోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి వీలుగా టీవీలు, వార్తా పత్రికలు, యోగా, ఆటవస్తువులను సైతం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారు బయట తిరగవద్దని కలెక్టర్ సూచించారు.
నేటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అమలులోకి వచ్చినందున తక్కువ సమయం ఉన్నప్పటికీ.. సమూహాలుగా రోడ్లపై సంచరించవద్దని ప్రజలను హెచ్చరించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్ తప్పక పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి: