ETV Bharat / state

'గిరిజనుల స్థితి గతులపై సమగ్ర సర్వే అవసరం' - ప్రకాశం జిల్లాలో గిరిజన సమస్యలు

ఆర్థిక స్వాలంబన కోసం ఎస్టీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని ప్రకాశం జిల్లా పాలనాధికారి తెలిపారు. గిరిజనుల స్థితి గతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాలల మరమ్మతు పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు.

prakasam dist collector meeting condected for st developments
ప్రకాశం జిల్లా పాలనాధికారి
author img

By

Published : Oct 14, 2020, 4:56 AM IST

గిరిజనుల స్థితి గతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రకాశం జిల్లా పాలనాధికారి పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్​లో ఆయన సమావేశం నిర్వహించారు. గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. సామాజిక ఆర్థికాభివృద్ధిపై ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సర్వే ఆధారంగా జీవనోపాధిని పెంచాలని తెలిపారు. జిల్లా జనాభాలో 8.81 శాతం ఎస్టీలు ఉన్నారని, అందులో యానాది, చెంచు, సుగాలీలు, నక్కల వారు 1,51,145 మంది ఉన్నారని ఆయన వివరించారు. ముఖ్యంగా వారికి వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.

చెంచు ప్రాంతాల్లోని యువతీ, యువకుల భావిష్యత్తుకు మార్గ నిర్దేశం చేయాలని కలెక్టర్​ స్పష్టం చేశారు. మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలన్నారు. అర్హులకు రేషన్ కార్డులు, జాబ్ కార్డులు ఇవ్వాలని, గృహాల నిర్మాణానికి ప్రోత్సహించాలన్నారు. అటవీ ప్రాంతంలోని ఆర్వోఎస్సార్ కింద 1,559 మందికి 3,780 ఎకరాలకు హక్కు పత్రాలు ఇటీవల పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ భూములను ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. పంపిణీ చేసిన భూముల్లో వైఎస్సార్ జలకళ కింద బోర్లు వేయాలని ఆదేశించారు.

60 ఏళ్ల వయస్సు దాటిన వారికి పింఛన్ అవకాశం కల్పించాలని, డ్రాప్ అవుట్స్​ను అరికట్టాలని జిల్లా పాలనాధికారి సూచించారు. ఎస్టీల కోసం 42 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు నడుస్తున్నాయని వాటిలో నాణ్యమైన విద్యాబోధనకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల మరమ్మతు పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమన్వయం లోపించిందన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేత శ్రద్ధాంజలి ఫ్లెక్సీలను చించిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.