ప్రకాశం జిల్లా బెస్తవారిపేట లో ఈ నెల 22న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆషియా అనే మహిళ పథకం ప్రకారం తన ఇంటి ఎదురుగా ఉన్న మహిళను కూలి పనికి వెళ్దామని తీసుకెళ్లింది. అనంతరం ఇంటి దగ్గర పనుందని.. వెంటనే వస్తానని చెప్పి ఇంటికొచ్చింది. సదరు మహిళ ఇంట్లోకి చొరబడిన ఆషియ.. నగలు, నగదు దొంగిలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 112 గ్రాముల బంగారం, 1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య