ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో ఈనెల 23వ తేదీన జరిగిన లక్క పోగు సుబ్బారావుహత్య కేసుకు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈ నెల 21న వివాహ కార్యక్రమంలో లో డీజే బాక్సులు పెట్టారు. కరోనా నేపథ్యంలో డీజే బాక్సులు పెట్టవద్దని పోలీసులు తెలిపారు. 23వ తేదీ సాయంత్రం మళ్లీ పాటకచేరి చేస్తుండగా ఓ వర్గానికి చెందిన ఒక వ్యక్తి అక్కడికి రావడంతో గొడవ మొదలైంది. గతంలో ఉన్న చిన్నపాటి గొడవలు ను దృష్టిలో ఉంచుకొని, కత్తులు ఇనుపరాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: పోలీసుల తీరుపై తెదేపా నిరసన.. కార్పొరేటర్ విడుదల