ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. దండుబాట, గిద్దలూరు, నల్లబండలోని పలువురి గృహాల్లో తనిఖీలు చేశారు. చీరాల సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో... సరైన పత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, 4 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు... నేరాలు తగ్గించేందుకు తనిఖీలు జరిపామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: సరకుల కోసం వచ్చారు... నగదు, బంగారం దోచుకెళ్లారు