ప్రకాశం జిల్లోలో పలు చోట్ల పోలీసులు నాటుసారా తయారీ కేంద్రలపై దాడులు నిర్వహించి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పొదిలి ఎక్సైజ్ సి.ఐ వెంకటరావు మర్రిపూడిమండలం కలుజుగుంట అటవీ ప్రాంతంలో సారా స్థావరాలపై దాడులు చేసి 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సివిల్ పోలీసులు తాళ్ళూరు ఎస్.ఐ ఆధ్వర్యంలో బొద్దికూరపాడులోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి నాలుగు డ్రమ్ముల బెల్లం ఊటను నాశనం చేశారు. గాడివాగులో జమ్ము పాదాల మాటున నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించిన అధికారులు 1200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ యథేచ్ఛగా నాటుసారా తయారీ అమ్మకాలు జరుగుతున్నాయి.
కరోనా విపత్తు వేళ... సారా మహమ్మారి కేళీ - ప్రకాశం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాల తాజా వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. నాటుసారా తయారీ జోరందుకుంది. ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు దాడులు జరుపుతున్నా సారా తయారీ మాత్రం ఆగటంలేదు. ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉండటం గమనర్హం.
![కరోనా విపత్తు వేళ... సారా మహమ్మారి కేళీ police attacks on Natusara Preparation centers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6995847-1077-6995847-1588210644358.jpg?imwidth=3840)
ప్రకాశం జిల్లోలో పలు చోట్ల పోలీసులు నాటుసారా తయారీ కేంద్రలపై దాడులు నిర్వహించి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పొదిలి ఎక్సైజ్ సి.ఐ వెంకటరావు మర్రిపూడిమండలం కలుజుగుంట అటవీ ప్రాంతంలో సారా స్థావరాలపై దాడులు చేసి 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సివిల్ పోలీసులు తాళ్ళూరు ఎస్.ఐ ఆధ్వర్యంలో బొద్దికూరపాడులోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి నాలుగు డ్రమ్ముల బెల్లం ఊటను నాశనం చేశారు. గాడివాగులో జమ్ము పాదాల మాటున నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించిన అధికారులు 1200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ యథేచ్ఛగా నాటుసారా తయారీ అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇవీ చూడండి...
'ఓట్ల కోసమే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు'