లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు మూసివేయించింది. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీ ఊపందుకుంది. ఆబ్కారీ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా... నాటుసారా తయారీ మాత్రం ఆగడం లేదు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరాజముల తండా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 2200 లీటర్ల బెల్లం ఊట, 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు.
ఇదీ చూడండి