ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని బోయినవారిపాలెంలో... శ్రీ పోలేరమ్మ అమ్మవారి శిడిమాను ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరున్న పోలేరమ్మకు తోటవారి పాలెం గ్రామస్తులు బంగారు కాసులపేరు సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో,అమ్మవారి వేషధారణలు, కనక తప్పెట్లతో ఊరేగింపు చేశారు.
పంటలు బాగా పండాలని మహిళలు పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. మొక్కులు చెల్లించారు. ఒక గొర్రెను పెట్టెలో ఉంచి అమ్మవారి చుట్టూ మూడుసార్లు శిడిమాను తిప్పి ఆ గొర్రెను వదలేస్తారు. ఇలా చేయటం వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. తరతరాలుగా ఈ ఆనావాయితి కొనసాగుతోంది.
ఇదీ చదవండి: