ETV Bharat / state

రైతు, బోర్డు కలిసి పని చేస్తే మరిన్ని ప్రయోజనాలు: పొగాకు బోర్డు ఛైర్మన్ - news on pokagu crop in ap

బోర్డు నిబంధనలు ప్రకారం పొగాకు సాగు చేస్తే... రైతు అవసరాలు తీర్చడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని పొగాకు బోర్డు ఛైర్మన్‌ రఘునాథబాబు అన్నారు. గతం కంటే ఇప్పుడు జరిమానాలు తగ్గించినట్లు తెలిపారు. భవిష్యత్తులో బోర్డు, రైతు ఒకే మాట మీద కలిసి పనిచేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే సీజన్‌లో పొగాకు నాణ్యతపై దృష్టి పెడుతున్నామని, మార్కెట్‌ ఇబ్బందులు ఎదురైతే పంట కొనేందుకు బోర్డే ముందుకొస్తుందని ఒంగోలులో 'ఈటీవీ భారత్'​కు తెలిపారు.

pogaku board chiar men on pogaku crop
పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాథబాబు
author img

By

Published : Oct 12, 2020, 9:54 AM IST

Updated : Oct 12, 2020, 4:16 PM IST

* ఈ ఏడాది సాగు లక్ష్యం ఎంత?

బోర్డు పరిధిలో ముగిసిన సీజన్‌లో 136 మిలియన్ల కిలోల ఉత్పత్తి లక్ష్యం ఇచ్చాం. వాతావరణ పరిస్థితులు కారణంగా రైతులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 121 మిలియన్ల కిలోల వరకే దిగుబడి వచ్చింది. ఈ కారణంగానే వస్తున్న సీజన్​లో ఈ లక్ష్యాన్ని తగ్గించి 115 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికే అనుమతిచ్చాం.

* రైతుకు గిట్టుబాటు ధర విషయంలో న్యాయం జరగడంలేదనే విమర్శ ఉంది?

మార్కెట్‌ అవసరాలు దృష్టిలో పెట్టుకొని రైతులు సాగు విధానాలు మార్చుకోవాలి. దీనికి బోర్డు సహకరిస్తుంది. ప్రధానంగా రైతు నాణ్యమైన పంట సాగు చేయాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ ఇచ్చేలా మన పొగాకు ఉండాలన్నది బోర్డు ధ్యేయం. నాణ్యత పెంచుకుంటూనే... పంట ఖర్చు తగ్గించుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి రావాలి. ఈ దిశగా రైతులకు సాంకేతిక సహకారాన్ని బోర్డు అందిస్తుంది.

* బ్యార్న్‌ పరిధిలో సాగు విస్తీర్ణం తగ్గించడంపై రైతులు నష్టపోతామంటున్నారు?

బ్యార్న్‌ పరిధిలో 29 క్వింటాళ్ళకు మించి దిగుబడి చేయరాదన్నది నిబంధనే... కానీ రైతుల్లోనూ తప్పిదాలు ఉన్నాయి. ఒక రైతు తన బ్యార్న్‌ పరిధిలో ఎక్కువ విస్తీర్ణం వేస్తే, ఒకరు పూర్తిగా వేయరు. వేయని బ్యార్న్‌ పేరుతో అధిక దిగుబడి వేసేవారు విక్రయాలు సాగిస్తున్నారు. సాగు చేయని రైతుల వివరాలు నిజాయితీగా తమకు తెలియజేస్తే, వారి అనుమతులు రద్దు చేయడానికి వీలవుతుంది. అప్పుడు బ్యార్న్‌ పరిధి పెంచడానికి వీలవుతుంది. రైతు ఒక అడుగు ముందుకేస్తే, తామూ రెండడుగులు ముందుకేస్తాం.

* పెనాల్టీలు తగ్గించాలన్న డిమాండ్‌కు బోర్డు ఏ మేరకు సహకరిస్తుంది?

నేను ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి తొలి 10 శాతం పంటపై 7.5శాతం పెనాల్టీ, 10 శాతం దాటిన తరువాత 15శాతం పెనాల్టీ ఉండేది. వీటిని 5 శాతం, 10శాతానికి తగ్గించాం. సాగు పరిమితి విషయంలో బోర్డు నిబంధనలు పాటిస్తే... రైతులు కోరింది ఇవ్వడానికి మేం సిద్దమే.

* అమ్మకాలు సమయంలో బయ్యర్లు మాయాజాలాన్ని ఎలా అడ్డుకుంటారు?

వేలం కేంద్రాల్లో అమ్మకాలు సమయంలో బయ్యర్లు వారి వారి వ్యాపార అవసరాలు బట్టి ధర హెచ్చుతగ్గులు సృష్టిస్తారు. ఈ ఏడాది మార్కెఫెడ్ మార్కెట్‌లోకి వచ్చింది. మళ్ళీ వస్తుందో లేదో చెప్పలేం అసలు మార్కెట్లో స్థిరమైన ధర ఉండేటట్లు చేస్తే కొంత సమస్య తొలగిపోతుంది. కనీసపు ధర నిర్ణయిస్తాం. ఆ ధర కంటే తక్కువకు బయ్యర్లు కోడ్‌ చేస్తే బోర్డే ముందుకొచ్చి పంట కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతుంది. ఇది వ్యాపారం కోసం కాదు రైతుకు కనీసపు మద్దతు ధర లభించడానికి. బోర్డుతోపాటు పొగాకు ఉత్పత్తిదారులు సహకారసంఘాలు లాంటి సంస్థలనూ సంప్రదించి, వారి చేత కూడా కొనుగోళ్లు చేయిస్తాం. దీని వల్ల రైతుకు తక్కువ ధర లభిస్తుందనే భావన కలగదు.

ఇదీ చదవండి:

అమరావతి సమరంలో అతివలది కీలక పాత్ర

Last Updated : Oct 12, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.