ETV Bharat / state

చీరాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధం..అవగాహన ర్యాలీ

ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించనున్న ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు.

plastic-ban-rally-in-prakasam
author img

By

Published : Sep 3, 2019, 1:46 PM IST

ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించాలని భారీ ర్యాలీ

పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించాలని పిలుపునిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, పురపాలక అధికారులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ... మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ ర్యాలీలో నినాదాలు చేశారు. విద్యార్థులు... భరతమాత, మహాత్మాగాంధీ, ప్లాస్టిక్ భూతం తదితర వేషధారణలతో ఆకట్టుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో భాగంగా గురువారం నుంచి చీరాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నామని, ముందస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.

Intro: FILE NAME : AP_ONG_42_03_PLASTIC_NISHADAM_STUDENTS_RALLI_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేదించాలని కోరుతూ ప్రకాశంజిల్లా చీరాల లొ పురపాలకసంఘం ఆద్వర్యంలొ పట్టణంలొ భారీ ర్యాలి నిర్వహించారు...మున్సిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డి మరియు పురపాలక అధికారులు, పోలీస్ అధికారులు ,వివిధ కశాలలు, పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నర్యాలి... మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమయి ప్రధానవీధులగుండా సాగింది... ర్యాలిలో ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్దాలను ప్రజలకు వివరించారు....ర్యాలిలొ జాతీయజెండా చేతపూని... విద్యార్ధులు భరతమాత, గాంధి,ప్లాస్టిక్ భూతం వేషధారణలతో ఆకట్టుకున్నారు... స్వచ్చ సర్వేక్షణ్-2020 లొ భాగంగా గురువారం నుండి చీరాల లొ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేదిస్తున్నామని... ముందుస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలి చేపట్టినట్లు మున్సిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు... ఈసందర్భంగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పర్యావరణం పరిరక్షించుకోవటం మనందరి భాద్యతని.... దుకాణదారులు కూడా ప్లాస్టిక్ సంచులను వాడకూడదని, అమ్మేవారు... కొనే వారు ప్లాస్టిక్ సంచులను వాడకూడదన్నారు...

బైట్ : ముంగా వెంకటేశ్వరరావు - విశ్రాంత జాయింట్ కలెక్టర్. Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.