ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శి వద్ద బాతులతో వెళుతున్న వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దావీదు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలుకాగా.. లక్షల రూపాయల విలువ చేసే బాతులు మరణించాయి. రోడ్డుపై ఉన్న డ్రమ్ములను తప్పించే క్రమంలో వాహనం బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హిందూ మతానికి ఏదో జరిగిపోయినట్లు అతిగా స్పందిస్తున్నారు : సీపీఐ రామకృష్ణ